TeluguFilm.info
అనన్య నాగళ్ల హిడి (వేర్ ది ఫీలింగ్) లాంచ్
నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అనన్య నాగళ్ల తో పాటు ఈటెల క్షమిత, సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, శ్రీనీ ఇన్ఫ్రా శ్రీనివాస్, కోమటి శ్రీనివాస్ రావు, స్రవంతి, శివ తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ... ‘మహిళలు తన సొంత కాళ్ళమీద నిలబడాలని నేను ఈ హిడి ను ప్రారంభించాను, మహిళలు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకొనే క్లోత్స్ హిడి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఉమేన్స్ మాత్రమే ఈ ఆన్ లైన్ బిజినెస్ చేసుకొనే వెసలబాటును కల్పిస్తున్నాను, ఒక బిగ్గెస్ట్ ఫ్రాన్చేజ్ లాగా దీనిని ముందుకు తీసుకొని వెళుతున్నాను, దీనికి మీ అందరి సపోర్ట్ కావలి’ అన్నారు.
