పెద్ద కలల వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న ఆర్నా ములర్
హైదరాబాద్‌కు చెందిన తెలుగు నటి ఆర్నా ములర్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పాత్ర ఏదైనా, అందులో సహజత్వాన్ని చూపిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల విడుదలైన ‘అగాధ’ చిత్రంలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్నా, అంతకుముందు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘రజాకార్’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లోనూ నటించారు.
ప్రస్తుతం ‘మా ఊరి మల్లన్న’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తండ్రి–కూతురు మధ్య ఉన్న అనుబంధం, భావోద్వేగాలను ప్రధానంగా చూపించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆర్నా పోషించిన పాత్ర కథలో కీలకంగా ఉండనుంది.
తెలుగు చిత్రాలతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టిన ఆర్నా, తన తొలి కన్నడ చిత్రానికి గాను ఇటీవల బెంగళూరులో జరిగిన చిత్ర సంతే ఫిల్మ్ అవార్డ్స్‌లో గుర్తింపు అందుకున్నారు.
నటనపై ఉన్న ఆసక్తి, కష్టపడే తత్వంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆర్నా ములర్, మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
“పెద్ద కలలు ఒక్కరోజులో నిజం కావు… ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగితే తప్పకుండా గమ్యం చేరుకోవచ్చు” అనే నమ్మకంతో ఆర్నా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
TF
TeluguFilm.info
సూరి & నివిన్ పులె నటించిన సంచారి అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ !!!
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో 'సంచారి' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
సంచారి సినిమాను కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.సుబ్బారెడ్డి ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది, ఇటీవల విడుదలైన మందాడి సినిమాతో సక్సెస్ సాధించిన సూరి అలాగే బెతలహెమ్ కుటుంబ యూనిట్ సినిమాతో సంచలన విజయం సాధించిన నివీన్ పులె ఈ సినిమాలో నటించడం విశేషం
రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపధ్యం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ్ లో తంగ మీన్కల్, తారమణి, పెరంబు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.
TF
TeluguFilm.info
VIHARI OTT Launched Sri Satya’s Vietnam Episodes Poster
VIHARI OTT is launching the official poster of its upcoming Vietnam Travel Episodes featuring popular television personality Sri Satya, at PVP Mall, Vijayawada
VIHARI OTT comes from the makers of “Vihari – The Traveller,” the popular travel show that created a historic milestone with 18 years of telecast on Telugu television.
VIHARI OTT official launch is slated for Nov 2026 with 500+ Hours of curated travel content.
Special offer to viewers “Enjoy curated travel content for free until 31st December 2026. Your 1-year subscription will begin in January 2027.”
The Vietnam series, directed and produced by A. L. Nitin Kumar, takes Telugu audiences on an exciting journey across Hanoi, Ninh Binh and Ho Chi Minh City, showcasing Vietnam’s destinations, culture, heritage, cuisine and unique travel experiences.
A. L. Nitin Kumar, who has been associated with Vihari’s long journey in travel media, is now taking the brand’s travel storytelling legacy forward into the OTT and digital era.
Sri Satya brings a fresh and engaging presentation to the Vietnam series, making the journey entertaining, informative and inspiring for Telugu audiences.
From 18 Years on Telugu Television to a New Journey on OTT.
VIHARI OTT – Travel. Explore. Experience
TF
TeluguFilm.info
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమాకు ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమాకు ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.
శ్రీ కేసరి నందన్ సినిమా: గుజరాతీ సినిమా చరిత్రలో ఒక కొత్త, సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోంది. నిర్మాత అతుల్ ఎం. బోసమియా, అతుల్ ఇండియా మూవీస్ బ్యానర్‌పై, గుజరాతీ చిత్ర పరిశ్రమ యొక్క మొట్టమొదటి 'పాన్-ఇండియా' చిత్రం 'శ్రీ కేసరి నందన్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుజరాతీ చిత్ర పరిశ్రమకు ఒక కొత్త గుర్తింపును ఇవ్వాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్, గుజరాతీలోనే కాకుండా మొత్తం 7 భారతీయ భాషలైన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీలలో విడుదల కానుంది.
దక్షిణాది మరియు గుజరాత్ ప్రతిభావంతుల అద్భుతమైన సంగమం
సినీ ప్రతిభ యొక్క ఈ అద్భుతమైన కలయిక అయిన 'శ్రీ కేసరి నందన్' చిత్రానికి, అవార్డు గ్రహీత అయిన తమిళ చిత్రనిర్మాత సబ్రినాథన్ ముత్తుపాండియన్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు అర్పిత రాంకా మరియు మౌలిక్ చౌహాన్ ప్రధాన పాత్రలలో నటించగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటీనటులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు సుభాష్ దండపాణి ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి దృశ్యరూపాన్ని అందించడానికి కెమెరా బాధ్యతలు చేపట్టగా, ప్రముఖ కన్నడ సంగీత స్వరకర్త అభినందన్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మహిపాల్ సింగ్ రాణావత్, రాజేష్ ఠాకూర్, హిరెన్ పటేల్ మరియు పరేష్ జగ్దా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అసోసియేట్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అతుల్ ఇండియా మూవీస్ ప్రకటించిన తొలి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్': 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల
అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పిస్తున్న 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమాకు ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.
శ్రీ కేసరి నందన్ చిత్రం: గుజరాతీ సినిమా చరిత్రలో ఒక కొత్త, సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోంది. అతుల్ ఇండియా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అతుల్ ఎం. బోసమియా, గుజరాతీ చిత్ర పరిశ్రమ యొక్క మొట్టమొదటి 'పాన్-ఇండియా' చిత్రం 'శ్రీ కేసరి నందన్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుజరాతీ చిత్ర పరిశ్రమకు ఒక కొత్త గుర్తింపును ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్, గుజరాతీలోనే కాకుండా మొత్తం 7 భారతీయ భాషలైన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీలలో విడుదల కానుంది.
దక్షిణాది మరియు గుజరాత్ ప్రతిభావంతుల అద్భుతమైన సంగమం
సినీ ప్రతిభ యొక్క ఈ అద్భుతమైన కలయిక అయిన 'శ్రీ కేసరి నందన్' చిత్రానికి, అవార్డు గ్రహీత అయిన తమిళ చిత్రనిర్మాత సబ్రినాథన్ ముత్తుపాండియన్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు అర్పిత రాంకా మరియు మౌలిక్ చౌహాన్ ప్రధాన పాత్రలలో నటించగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటీనటులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు సుభాష్ దండపాణి ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి దృశ్యరూపాన్ని అందించడానికి కెమెరా బాధ్యతలు చేపట్టగా, ప్రముఖ కన్నడ సంగీత స్వరకర్త అభినందన్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మహిపాల్ సింగ్ రాణావత్, రాజేష్ ఠాకూర్, హిరెన్ పటేల్ మరియు పరేష్ జగ్దా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అసోసియేట్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
భక్తి మరియు సంస్కృతి యొక్క అద్భుత సమ్మేళనం
విశ్వాసం, భక్తి, వారసత్వం మరియు పరివర్తన అనే దైవిక ఇతివృత్తం ఆధారంగా, 'శ్రీ కేసరి నందన్' ఒక సాంప్రదాయ కథను ఆధునిక సాంకేతికత మరియు దక్షిణ భారత శైలితో ఒక గొప్ప చలనచిత్ర స్థాయిలో ప్రదర్శించనుంది. గుజరాతీ సాంస్కృతిక విలువలను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించడంలో ఇది ఒక మైలురాయి ప్రయత్నం. ఈ బృహత్తర చిత్రం 2027 రామనవమి పవిత్రమైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో విడుదల కానుంది.
TF
TeluguFilm.info
‘ఉపేంద్ర’ పుట్టినరోజు సందర్బంగా ఉపేంద్ర సినిమా సెప్టెంబర్ 18న రీ రిలీజ్ !!!
రెండు దశాబ్దాల క్రితం కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం ఉపేంద్ర. రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో, అప్పట్లో సంచలనం సృష్టించిన ఉపేంద్ర మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ‘ఉపేంద్ర’ సినిమా 1999లో విడుదలై కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు కొత్త తరానికి కూడా వినోదం పంచేందుకు సిద్ధమైంది.
‘ఉపేంద్ర’ పుట్టినరోజు సందర్బంగా ఉపేంద్ర సినిమాను సెప్టెంబర్ 18న ఎంజీ మూవీస్ బ్యానర్ పై ఎం అచ్చిబాబు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
ఉపేంద్ర ఈ సినిమాను తీసిన అప్రోచ్‌కు అప్పట్లో అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రల్లో నటించారు. శిల్పా శ్రీనివాస్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతాన్ని గురుకిరణ్ అందించారు. అప్పట్లో పాటలు ట్రెండ్ సెట్ చేసాయి.
సెప్టెంబర్ 18న థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్న ఉపేంద్ర చిత్రం ను చూడ్డానికి అభిమానును వెయిట్ చేస్తున్నారు, బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
TF
TeluguFilm.info
*రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!*
శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’ .... ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు
వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, ఈ చిత్రం విజయం సాధించాలని ఆయన అన్నారు.
ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ప్రేమ… చివరికి వారి జీవితాలనే మార్చిన కథ.... ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక విద్యా విధానంలో ర్యాంకుల కోసం పోటీ, యువతి, యువకుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు… ఈ gen - z తరం క్షణిక ఆనందాలు, భావోద్వేగాలు, తొలి ప్రేమ మరోవైపు...
ఇద్దరు టాప్ ర్యాంకర్స్ మధ్య మొదలైన ఈ ప్రేమ, వారి చదువు, భవిష్యత్తు, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపింది? ప్రేమ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన అలజడి ఎక్కడికి దారితీసింది అనే ఎమోషనల్ జర్నీ.
ప్రతి ఒక్కరి కాలేజ్ రోజులను, వారి తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే… యువత ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం మధ్య జరిగే సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా చూపించే చిత్రం, అదే “ఫస్ట్ బెంచ్ ప్రేమకథ”
ఈ చిత్రానికి కొల్లబత్తిన జోష్న రాణి, నక్క హరిబాబు, కె రమేష్ చంద్ర నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శివకోటి బాబి, పఠాన్ వలీఖాన్, కాకరపల్లి రాజు.
TF
TeluguFilm.info
తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*
▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ
▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం
హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవి కోసం నలుగురు అభ్యర్థులు—మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ పడ్డారు. వీరిలో ‘మన ప్యానెల్’ తరఫున నిలబడిన మోహన్ వడ్లపట్ల అందరికంటే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
మొత్తంగా నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, నలుగురి పోటీలో మోహన్ వడ్లపట్ల సాధించిన భారీ విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనపై నిర్మాతల సమస్యల పరిష్కారం, పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది.
NRIగా మోహన్ వడ్లపట్లకు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు
మోహన్ వడ్లపట్ల NRIగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతగా ఆయన పలు వైవిధ్యమైన చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సైకాలజికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive For Murder) అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది.
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకో-కిల్లర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం విడుదలకు ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం 15కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
‘M4M-2’ సీక్వెల్ ప్రకటన
‘M4M’ అమెరికాలో విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2026లో శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో చిత్ర బృందం అధికారిక సీక్వెల్‌ను ప్రకటించింది. ‘M4M-2: Killer Games’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందనుంది. ఇందులోనూ మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ కలిసి పనిచేయనున్నారు.
OTTలోనూ ‘M4M’కు ఆదరణ
థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం ‘M4M’ చిత్రం జూన్ 19, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. Lionsgate Play, Amazon Prime Video వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చిత్రం OTT ప్రేక్షకులను అలరిస్తోంది.
నిర్మాతగా పలు వైవిధ్యమైన చిత్రాలు
మోహన్ వడ్లపట్ల తన సొంత బ్యానర్ *‘మోహన్ మీడియా క్రియేషన్స్’*పై పలు తెలుగు చిత్రాలను నిర్మించారు.
‘మల్లెపూవు’ (2008): భూమిక చావ్లా, మురళీ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమకథా చిత్రం.
‘మెంటల్ కృష్ణ’ (2009): నటుడు సత్యం రాజేష్ హీరోగా, శ్రీహరి ముఖ్య పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా చిత్రం.
‘కలవరమాయే మదిలో’ (2009): కలర్స్ స్వాతి, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించగా, సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.
నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మోహన్ వడ్లపట్ల తాజాగా తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, నిర్మాతల సమస్యలు, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
TF
TeluguFilm.info
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సిఏం జి.పరమేశ్వర రావు గారి ఆత్మీయ మిత్రుడు ఖాదర్ బాషా పాల్గొన్నారు.
కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ ఎస్ హనుమంత రెడ్డి నిర్మాత, భార్గవ గొట్టిముక్కల దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ స్టార్ ఎల్.ఎమ్ ప్రేమ్
తాను ప్రేమిస్తున్న కాజల్ జీవితంలోకి ఇంకో అబ్బాయి రావడంతో, కాజల్ ని అపార్ధం చేసుకుంటాడు కుషాల్.
తరువాత ఒకరునొకరు అర్థం చేసుకొని కుషాల్ కాజల్ లు కలిసిపోతారు. ఇది ఈ చిత్ర ముఖ్య కథాంశం, సరికొత్త స్క్రీన్ ప్లే తో దర్శకుడు భార్గవ గొట్టిముక్కల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్ జి శంకర్, సినిమాటోగ్రఫీ పిచ్చారాగాడి మణి, లిరిక్: శ్రీరామ్ తపస్వి, మేకప్: నగేష్, సింగర్: వినాయక్. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన టీజర్, ట్రైలర్, రాబోతున్నాయి.